- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సేవా స్ఫూర్తికి గౌరవం.. పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌కు సీమంతం
పోలీస్ స్టేషన్ అంటే కఠినత్వానికి మారుపేరు అన్న అభిప్రాయం మారిపోతోంది. మక్తల్ పోలీస్ స్టేషన్‌లో ఓ హృద్యమైన సంఘటన అందరికీ ఆప్యాయతను గుర్తుచేసింది.

దిశ, మక్తల్: పోలీస్ స్టేషన్ అంటే కఠినత్వానికి మారుపేరు అన్న అభిప్రాయం మారిపోతోంది. మక్తల్ పోలీస్ స్టేషన్‌లో ఓ హృద్యమైన సంఘటన అందరికీ ఆప్యాయతను గుర్తుచేసింది. ఏడుమాసాల గర్భంతో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ చైతన్యకు స్టేషన్‌లోనే సీమంత వేడుక నిర్వహించి ఘనంగా సన్మానించారు.
వివరాల్లోకి వెళితే.. మక్తల్ పోలీస్ స్టేషన్‌లో సేవలందిస్తున్న కానిస్టేబుల్ చైతన్య ప్రస్తుతం ఏడో నెల గర్భవతిగా ఉండగా, డెలివరీకి సంబంధించి మెటర్నిటీ సెలవులకు వెళ్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం సీఐ రామ్‌లాల్, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి, మహిళా ఎస్సై రేవతి, స్టేషన్ సిబ్బందితో కలిసి ఆమెకు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
చీరలు, పూలు, పండ్లు, తిండి వంటలతో ఆమెకు సంప్రదాయ పద్ధతిలో సీమంతం చేశారు. ఆ మహిళా కానిస్టేబుల్ ను అందరూ కుటుంబ సభ్యుల మాదిరిగా ధైర్యం చెప్పారు. పోలీసులు విధినిర్వహణలో బిజీగా కేసులతో హడావిడిగా ఉండే పోలీసు స్టేషన్ లో తాను పని చేసే పోలీసు స్టేషన్ లోనే తనకు ఉన్నతాధికారుల సమక్షంలో ఘనంగా సన్మానించడంతో భావోద్వేగానికి గురైన చైతన్య ఆనందబాష్పాలతో పోలీస్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపింది.






