విద్యా విజ్ఞానిక సదస్సును విజయవంతం చేయండి : జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు

by Ratna Kumari |   (  Updated:2025-11-17 15:49:13  IST  )

దిశ, నారాయణఖేడ్ : నారాయణ ఖేడ్ లో 18-20 వరకు జరగనున్న సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు కోరారు. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు.

విద్యా విజ్ఞానిక సదస్సును విజయవంతం చేయండి : జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు
X

దిశ, నారాయణఖేడ్ : నారాయణ ఖేడ్ లో 18-20 వరకు జరగనున్న సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు కోరారు. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. మంగ‌ళ‌వారం మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, కలెక్టర్ పాల్గొని సైన్స్ పేయర్ ను ప్రారంభిస్తారని తెలిపారు. నారాయణ ఖేడ్ లో ఏర్పాటు చేసిన ఈ సైన్స్ పేయర్ లో ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలకు చెందిన‌ వందలాది మంది విద్యార్థులు, మార్గదర్శకులైన ఉపాధ్యాయులు పాల్గొంటారని అన్నారు. 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 19 తేదీ వివిధ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు ప్రదర్శనలు తిలకిస్తారన్నారు. 20వ తేదీ కూడా ప్రదర్శన తిలకిస్తారని అన్నారు. ఈ విజ్ఞాన సదస్సులో ఏడు విభాగాలలో దాదాపు 700 విజ్ఞాన ప్రదర్శనలు ఉంటాయన్నారు. మన జిల్లా నుంచి ఈ సదస్సుకు ఎంపికైన రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కూడా కనబరిచారన్నారు . ఈసారి కూడా అంతే అద్భుతంగా విద్యార్థులు ఉపాధ్యాయులు వారి వారి ప్రదర్శనలు తీసుకొస్తారని వాటిని ప్రత్యేకంగా మూడు రోజులపాటు అందరికీ తిలకించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, డిసి ఈబి సెక్రటరీ లింబాద్రి, ఎంఈఓ లు విశ్వనాథ్ మన్మధ కిశోర్, నాగారం శ్రీనివాస్ రాములు , రాజశేఖర్ , పిజిహెచ్ఎంలు నర్సింహులు పండరి, గోపాల్ యాదవ్ రెడ్డి సైన్స్ ఫెయిర్ మీడియా ఇంచార్జ్ భాస్కర్, చంద్రశేఖర్ఆచార్య రమేష్ నాగనాథ్ పాల్గొన్నారు.

Next Story