- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ద తండ్రపాడులో అగ్నిప్రమాదం.. గుడిసె దగ్ధం
షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద తండ్రపాడులో అగ్నిప్రమాదం చోటుచేసుకుని పూర్తిగా గుడిసె దగ్ధం అయ్యింది.

దిశ, అలంపూర్/రాజోలి: పంట కోసం తెచ్చుకున్న సామాగ్రి, జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము.. ఒక్క అర్ధరాత్రి వేళ వచ్చిన అగ్నిప్రమాదంలో బూడిదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్దతాండ్రపాడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ రైతు నివాసం ఉంటున్న రేకుల గుడిసె పూర్తిగా కాలిపోయిన ఘోర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్ద తాండ్రపాడు గ్రామానికి చెందిన నిరుపేద రైతు జయన్న తన కుటుంబంతో కలిసి రేకుల గుడిసెలో నివాసం ఉంటున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో మోషన్న తన కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి ఇంటి ఆరుబయట నిద్రపోయారు. అర్ధరాత్రి మంటలు గమనించేలోపే గుడిసె పూర్తిగా అగ్నికి ఆహుతైంది.
నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం..
ఒకవేళ లోపల నిద్రించి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని, కేవలం ఆరుబయట పడుకోవడం వల్లే ప్రాణాలు దక్కాయని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతు జయన్నకు ఈ ప్రమాదం కోలుకోలేని దెబ్బ తీసింది. తన వంట భూమికి నీటిని అందించి, పంట పండించుకుందామని ఎంతో ఆశతో ఈ మధ్య కాలంలోనే అప్పులు చేసి వాటర్ డ్రిప్ పైపులను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. సాగు ప్రారంభించేలోపే ఆ డ్రిప్ పైపులన్నీ మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సాగు సామాగ్రితో పాటు ఇంట్లో ఉన్న సామాగ్రి, వెండి పట్టీలు, బంగారు కమ్మలు, కాస్త నగదు, ఐదు సంచుల జొన్న ప్యాకెట్లతో పాటు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ రైతు జయన్న కుటుంబాన్ని ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు తక్షణమే పరిశీలించి, నష్టపరిహారం అందించి మానవతా దృక్పథంతో ఆదుకోవాలని గ్రామస్తులు మరియు రైతులు కోరారు. సుమారు నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు జయన్న వాపోయాడు






