- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొల్లాపూర్ రోడ్లకు మహర్థశ
దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లోని 11గ్రామీణ బీటీ రహదారుల పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 77.8 కిలోమీటర్ల నిడివి గల రోడ్లకు రూ.1162.50

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లోని 11గ్రామీణ బీటీ రహదారుల పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 77.8 కిలోమీటర్ల నిడివి గల రోడ్లకు రూ.1162.50 లక్షలు మంజూరు చేసిందని మంత్రి జూపల్లి క్యాంపు కార్యాలయం ప్రతినిధి పసుపుల నర్సింహా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన పనుల వివరాలను ఆయన విడుదల చేశారు. చిన్నంబావి మండలం వెల్గొండ నుంచి పెద్ద దగడ 16.60 కి మీటర్ల రోడ్డు కు రూ. 2490లక్షలు,పెంట్లవెల్లి పీడబ్ల్యూరోడ్డు నుంచి సింగోటం వరకు 12.10 కిలోమీటర్లు రూ, 1815 లక్షలు, పీడబ్ల్యూరోడ్డు అంకిరావు పల్లి, వయా కుడికిల్ల, నార్లాపూర్ వరకు 8.70 కి మీటర్లు రూ,1305 లు మంజూరైనట్టు ఆయన తెలిపారు. అలాగే వీపనగండ్ల టూ కల్వరాల వరకు 8 కిలోమీటర్లు రూ,12కోట్లు, కోర్ల కుంట ఎక్స్ రోడ్డు నుంచి తూంకుంట వరకు 8 కి మీటర్లు రూ, 12 కోట్లు, పీడబ్ల్యూ రోడ్డు నుంచి నక్కలపల్లి, వెన్న చర్ల, బండరాయిపాకుల వరకు 6.95 కి మీ వరకు రూ,10కోట్ల 42 లక్షల 50 వేలు, చింతల పల్లి నుంచి కొండూరు, జాలుబావి తాండ వరకు 5కిలోమీటర్లు రూ. 7 కోట్ల 50లక్షలు, పాన్ గల్ మండలం పీడబ్ల్యూ రోడ్డు నుంచి బండపల్లి, జమ్మా పూర్ వరకు 4.40కి మీటర్లు రూ.6కోట్ల 60లక్షలు, తీగల పల్లి నుంచి అనంతపురం, ఎదుల వరకు 3.80 కి మీటర్లు రూ,5కోట్ల 70లక్షలు,కేతపల్లి టూ వీపనగండ్ల వరకు 3 కి మీటర్లు రూ,4కోట్ల 50లక్షలు,చింతల పల్లి టూ జాలుబావి తాండ వరకు 1.20 కి మీటర్లు, రూ,కోటి 80లక్షలు మంజూరైనట్టు మంత్రి క్యాంపు కార్యాలయం ప్రతినిధి పసుపుల నర్సింహా వివరించారు.






