అద్భుతమైన 'పెన్సిల్' కళాకారుడు మహేష్ కుమార్

by Ratna Kumari |

అతను పెన్సిల్ తో వ్యక్తుల మోహం కవళికలు గీస్తే ఔరా అనాల్సిందే. అతని పేరు మహేష్ కుమార్. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన ఆయన స్థానిక పంచవటి విద్యాలయంలో ఆర్ట్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు.

అద్భుతమైన పెన్సిల్ కళాకారుడు మహేష్ కుమార్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : అతను పెన్సిల్ తో వ్యక్తుల మోహం కవళికలు గీస్తే ఔరా అనాల్సిందే. అతని పేరు మహేష్ కుమార్. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన ఆయన స్థానిక పంచవటి విద్యాలయంలో ఆర్ట్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. పెన్సిల్ తో మనుషుల మోహం కద‌ళికలు గీయడమంటే మామూలు విషయం కాదు. కొంచెం తేడా వచ్చినా ఆ బొమ్మకే అందం పోతుంది. ప్రతి ఆదివారం మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించే హ్యాపీ సండే కార్యక్రమంలోని భాగంగా, ఈ ఆదివారం వేదిక పక్కన ఒక టేబుల్ వేసుకొని 'పెన్సిల్ మొన' తో ఒక వ్యక్తి రూపాన్ని అచ్చు గుద్దినట్లు గీసాడు మహేష్ కుమార్. ఆరా తీయగా, తనకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే ఎంతో ఇష్టమని, తన అభిరుచి మేరకు దాన్ని వృత్తిగా మార్చుకొని పెన్సిల్ చిత్ర లేఖనంతో చిత్రాలను రూపొందిస్తున్నానని, అంతేకాక వాటర్ కలర్, పోస్టర్ కలర్, పెయింటింగ్ లు కూడా వేస్తానని తెలిపారు. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాన్ని గీసి రాష్ట్ర బీజేపీ నాయకులతో డిల్లీ కి కానుకగా పంపించానని, అలాగే అమిత్ షా, నోబుల్ శాంతి గ్రహిత కైలాష్ సత్యార్థి, మాజీ గవర్నర్ నరసింహన్ మాజీముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మలను కూడా పెన్సిల్ తో గీసి పెయింటింగ్ తో గీశానని మహేష్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో రెండవ బహుమతి, తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ ఛాలెంజింగ్ అవార్డు, నిజామాబాద్ లో ఐడియల్ అవార్డు, అనేక కార్టూన్ ప్రదర్శన పోటీల్లో పాల్గొన్నానని ఆయన వివరించారు. ఏదిఏమైనా ఇలాంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story