వారం రోజుల్లో దొంగలను పట్టుకున్న జిల్లా పోలీసులు

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : వరుస దొంగతనాల కేసుల్లో ఎప్పటికప్పుడు దొంగలను పట్టుకుంటూ జిల్లా పోలీసులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్

వారం రోజుల్లో దొంగలను పట్టుకున్న జిల్లా పోలీసులు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : వరుస దొంగతనాల కేసుల్లో ఎప్పటికప్పుడు దొంగలను పట్టుకుంటూ జిల్లా పోలీసులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కేంద్రంలో జరిగిన దొంగతనం కేసు వివరాలను తెలిపారు. పట్టణంలోని బాలాజీనగర్ లో నివాసం ఉంటున్న వ్యవసాయదారుడు ఎ.రాజేశ్వర్ రెడ్డి గత నెల 27 న తన ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లాడని, మరుసటి రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో ఉన్న 4 కిలోల వెండి, 20 వేల నగదు దొంగతనం చేశారని ఆమె తెలిపారు. మరుసటి రోజు ఉదయం ఇంటి పనిమనిషి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్న విషయాన్ని గమనించి ఇంటి యజమానికి ఫోన్ ద్వారా తెలిపిందని, వెంటనే తిరుపతి నుండి వచ్చిన రాజేశ్వర్ రెడ్డి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, వన్ టౌన్ సీఐ అప్పయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని ఆమె అన్నారు. మంగళవారం ఉదయం 6-30 గంటల సమయంలో ట్యాంక్ బండ్, రామయ్య బౌలీ వద్ద ఒక కారు అనుమానాస్పదంగా నిలిపి ఉంచినట్లు సమాచారం అందుకున్న సీఐ అప్పయ్య ఆదేశాల మేరకు ఎస్ఐ శ్రీన‌య్య సిబ్బందితో అక్కడికి చేరుకుని కారును తనిఖీ చేయగా కారులోని వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించాడని.. పోలీసులు వెంటాడి పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.

పట్టుబడిన దొంగను విచారించగా, నాగర్ కర్నూలు జిల్లా, పెద్దకొత్తపల్లి గ్రామంలో నివాసముండే ఎండి.మహబూబ్ పాషా(43)(తండ్రి లేట్ అబ్ధుల్ ఖాదర్), కారు డ్రైవర్ వృత్తి చేస్తున్నాడని, గత కొంతకాలంగా మహబూబ్ నగర్ పట్టణంలో దొంగతనాలు చేస్తున్నాడని ఆమె తెలిపారు.నిందితుడి నుండి 43 గ్రాముల బంగారం,7 కిలోల వెండి వస్తువులు, 26,600 రూపాయల నగదు, ఒక కారు, మోబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ జానకి పేర్కొన్నారు. దర్యాప్తులో కృషి చేసిన సిసిఎస్ సీఐ లు రత్నం, ఎస్ఐ రమేష్, రాజేంద్ర ప్రసాద్, వన్ టౌన్ ఎస్ఐ సీనయ్య, రూరల్ ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందిని ఆమె అభినందించారు.

Next Story