- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాదాసి కురువలను ఎస్సీ జాబితాలో చేర్చాలి : రాచూరి తిరుపతయ్య
దిశ, వీసనగండ్ల : మాదాసి కురువలను ఎస్సీ కుల దృవీకరణ పత్రాలు జారీ చేయాలని కోరుతూ మండల మాదాసి కురువ సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ వరలక్ష్మీ కి వినతిపత్రం అందజేశారు. ఈ

దిశ, వీపనగండ్ల : మాదాసి కురువలను ఎస్సీ కుల దృవీకరణ పత్రాలు జారీ చేయాలని కోరుతూ మండల మాదాసి కురువ సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ వరలక్ష్మీ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీపనగండ్ల మండల అధ్యక్షుడు రాచూరి తిరుపతయ్య, ఉపాధ్యక్షుడు పెద్ద ఉషన్, ప్రధాన కార్యదర్శి, ఒరే తిరుపతయ్య మాట్లాడుతూ మాదాసి కురువలు అడవుల ప్రాంతాలలో గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తూ అక్షరాస్యత లేకపోవడం వల్ల ఎన్నో సామాజిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చదువు లేకపోవడం బాల్యవివాహాలు వంటి సమస్యలు కూడా ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాంతాలలో మాదాసి కురువలకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న ఈ ప్రాంతంలో మాత్రం అధికారులు మాదాసి కురువలకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ఆదేశాలు ఉన్నప్పటికీ మండల స్థాయి అధికారులు మాత్రం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. మాదాసి కురువ జాతి ఎస్సీ జాబితాలో 30 నెంబర్ లో ఉందని, ఎస్సీ కమిషనర్ జారీచేసిన 1268 జీవో ప్రకారం మాదాసి కురువ సర్టిఫికెట్లు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాదాసి కురువలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో మాదాసి కురువ సభ్యులు రాచురి రాజశేఖర్, ఆవుల ఉషన్, రాచురి రమేష్ ఉన్నారు.






