- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిచ్చికుక్క స్వైర విహారం
మరికల్ మండల పరిధిలోని ఇబ్రహీంపట్నం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారంలో గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. గ్రామానికి సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల నుంచి గ్రామంలోకి చొరబడిన కుక్క ఇద్దరి పై దాడి చేసి తీవ్ర కలకలం రేపింది.

దిశ, మరికల్ : మరికల్ మండల పరిధిలోని ఇబ్రహీంపట్నం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారంలో గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. గ్రామానికి సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల నుంచి గ్రామంలోకి చొరబడిన కుక్క ఇద్దరి పై దాడి చేసి తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్ మండల కేంద్రం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే మార్గంలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద ఎప్పటి నుంచో అనాథ కుక్కలు సంచరిస్తున్నాయి. గురువారం ఆ ప్రాంతం నుంచి ఓ పిచ్చికుక్క గ్రామంలోకి చొరబడి ఓ వృద్ధ మహిళతో పాటు మరో వ్యక్తిని కాటు వేసింది. అందులో ఒకరు తీవ్రంగా గాయపడడంతో ఆమెని చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇక అదే కుక్క ఆరు గేదెలు, నాలుగు ఎద్దులు, ఒక గొర్రెపై కూడా దాడి చేసి కాటు వేసిందని గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. చివరకు గ్రామస్తులు అప్రమత్తమై పిచ్చికుక్కను పట్టుకుని చంపి తగలబెట్టినట్లు సమాచారం. డంపింగ్ యార్డ్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.






