ఆ పాఠశాలలో వింత పోకడ..!

by Ratna Kumari |

ఆ పాఠశాలలో అన్ని వింతపోకడలు కనపడుతున్నాయి విద్యార్థులు ఆరు బయట భోజనం చేస్తుంటే.. ఉపాధ్యాయులకు చెందిన బైకులు మాత్రం వరండాల్లో, రూముల్లో భద్రపరచుకున్నారు.

ఆ పాఠశాలలో వింత పోకడ..!
X

దిశ, ఉప్పునుంతల : ఆ పాఠశాలలో అన్ని వింతపోకడలు కనపడుతున్నాయి విద్యార్థులు ఆరు బయట భోజనం చేస్తుంటే.. ఉపాధ్యాయులకు చెందిన బైకులు మాత్రం వరండాల్లో, రూముల్లో భద్రపరచుకున్నారు. ఇది వింతల అనిపించినా నిజమండోయ్‌.. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని లక్ష్మాపూర్ (పీజీ)ప్రభుత్వ పాఠశాల 40 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులు అందులో ఒకరు 6 నెలలుగా ఎడ్యుకేషన్ లీవ్ లో ఉన్నారు. మంగళవారం స్కూల్ ను విజిట్ చేయ‌గా 40 మందికి 20 మందే విద్యార్థులు అటెండ్ అయ్యారు.

మెనూ ప్రకారం భోజనం లేదు

పాఠశాలకు అటెండ్ అయ్యే విద్యార్థులకు కూడా మెనూ ప్రకారం భోజనం అందించే పరిస్థితి ఆ పాఠశాలలో కనిపించడం లేదు. ఒకే ఒక్క కర్రీతో పూట గడుపుతున్నారు. అంచనా వేయలేని చిన్న వయసు పిల్లలు కావడంతో వారిష్టానుసారంగా భోజనం కర్రీలు అందిస్తున్నారు. ఐనా కొందరు ఇంటి నుండి అదనంగా సాంబారు లాంటివి తీసుకొచ్చుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై అటువైపు చూడకపోవటం వారికి అన్ని విధాల కలిసొచ్చినట్లుంది. ప్రభుత్వం అందించే సన్న బియ్యం భోజనం, రకరకాల మెనూ ప్రకారం అందించే కర్రీలు కడుపునిండా భోజనం చేస్తున్నారు మా చిన్నారులు అనే ధీమాలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. కానీ అంత వ్యతిరేకంగా జరుగుతుందనే నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారుల పర్యవేక్షణ వల్ల మార్పు రావాలని గ్రామస్తులు కోరుతున్నారు.

విద్యార్థులకు అందని రాగి జావా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మార్నింగ్ రాగిజావ అందించాలని నిబంధనలు జారీ చేసినప్పటికీ కొన్ని పాఠశాలల్లో దాదాపుగా అమలు కావడం లేదు. లక్ష్మాపూర్ పాఠశాలలో రాగి జావా మొదలైనప్పటినుండి విద్యార్థులకు అందివ్వటం లేదు అనేది స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఆ పాఠశాలకు చెందిన హెడ్ మాస్టర్ వెంకటయ్య మాట్లాడిన విదానం ప్రకారం రాగి జావా ప్యాకెట్లు పంపిణీ మొదట్లో ఒక్కరోజు లేటుగా వెళ్లడంతో మాకు దొరకలేదనీ అదేంటని ఎంఈఓ ను ప్రశ్నిస్తే ఎవరికి వారు తీసుకెళ్లారు మరి లేటుగా రావడం మీ ఇష్టం అని సమాధానం ఇచ్చారని ఆయన తెలిపారు. ఏ పాఠశాలకు సంబంధించిన క్వాంటిటీ పంపిణీ విధానం ఆ పాఠశాలకు అందుతుంది కదా మీకు ఎలా అందలేదు అనే ప్రశ్నకు ఇలా సమాధానాలు ఇవ్వడం వింతగా అనిపించింది. విద్యాశాఖ చట్టం అమలు తీరు అధికారుల నిర్లక్ష్యపర్యవేక్షణ తీరుకు అద్దం పడుతుంది అనడానికి ఇది సాక్షాత్తు నిదర్శనం. మధ్యాహ్నం విద్యార్థులు భోజన అనంతరం ఉపాధ్యాయులు ఎవరు కూడా పాఠశాలలో ఉండకుండా వెళ్ళిపోతున్నారని గ్రామస్థుల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి.యాప్ అటెండెన్స్ ఉన్నా కూడా వచ్చిన వెంటనే అటెండెన్స్ వేసుకొని వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి వచ్చి అటెండెన్స్ వేసుకుంటున్నారనే ఆరోపణలు చేస్తున్నారు.గ్రామస్థులు

బైక్ లు రూములో పెట్టటం తప్పే : ఎంఈవో చంద్ర‌శేఖ‌ర్

ఉపాధ్యాయులకు చెందిన బైకులు రూముల్లో ఉంచడం తప్పే అలా ఇంకోసారి జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు అందించే భోజనం మెనూ ప్రకారం అందించాలి. లేని యెడల చర్యలు తీసుకుంటాం. ప్రతి స్కూల్ ఉపాధ్యాయుడు సమయం పాటించాలి ఉదయం నుండి సాయంత్రం వరకు కచ్చితంగా స్కూల్ అవర్స్ లో ఉండాలి అలా లేనియెడల రుజువైతే చర్యల కోసం ఉన్నత అధికారులకు నివేదిక అందిస్తాం.

Next Story