పాఠ‌శాల‌కు తాళం.. ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల ధ‌ర్నా..!

by Ratna Kumari |

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం ఇప్పలపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను పదర మండల విద్యాశాఖాధికారి కావాలని పని సర్దుబాటు,

పాఠ‌శాల‌కు తాళం.. ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల ధ‌ర్నా..!
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం ఇప్పలపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను పదర మండల విద్యాశాఖాధికారి కావాలని పని సర్దుబాటు, సమీప దూరం అనే నెపంతో ఉపాధ్యాయులను ఇతర గ్రామాలకు పంపించాడు. ఈ విష‌యం తెలుసుకున్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల‌ తల్లిదండ్రులు, బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు పాఠశాలకు తాళాలు వేసి, గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో తిరిగి ఉపాధ్యాయులను నియమించాలని పదరా- మద్దిమడుగు ప్రధాన రహదారిపై మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇప్పలపల్లి & గానుగుపెంట గ్రామాలకు కలిపి ఒకే పాఠశాల ఉన్నదని, విద్యార్థుల సంఖ్య 110 మందికి 7 మంది ఉపాధ్యాయులు వారిలో 3 స్కూల్ అసిస్టెంట్లు, 4 ఎస్జీటీలు లు ఉండగా.. వీరిలో ఒకటి విద్యా సంబంధిత సెలవులో ఉండగా ఒకరిని 2 నెలల క్రితం పని సర్దుబాటు అనే నెపంతో మద్దిమడుగు గ్రామానికి పంపించారన్నారు. ప్రస్తుతం అదే సాకుతో మరో ఉపాధ్యాయురాలిని, మారడుగు గ్రామానికి పంపించగా మిగిలిన ఒక్క ఎస్జిటి అనారోగ్య సంబంధించిన సెలవుపై ఉండగా విద్యార్థులకు విద్య బోధన జరిగేది ఎలా అని మండిపడ్డారు.

ఈ తతంగాన్ని గమనించిన పిల్లల తల్లిదండ్రులు ఎంఈఓ ను ఉపాధ్యాయులను తిరిగి కేటాయించాలని విజ్ఞప్తి చేసిన కూడా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం ఎన్ని అర్జీలు, ఫోన్లు చేసినా పెడ చెవిన పెట్టడం లేదు. అసలు తల్లిదండ్రులను పాఠశాలకు తరుచుగా ఎందుకు రాణిస్తున్నారని ఉపాధ్యాయులను భయపెట్టడం వంటివి చేయడం చూసి చేసేదేమి లేక ఆలోచించి పాఠశాలకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రవేశం పెట్టిన ముఖ ఆధారిత హాజరు (FRS) ఉన్నందున ప్రస్తుతం వ్యవసాయ పనుల కారణంగా పిల్లలను తల్లిదండ్రులు పత్తి తీత పనులకు తీసుకెళ్ళడం మూలంగా హాజరు శాతం తగ్గిందని, గతంలో పని సర్దుబాటు అనే నెపంతోనే ఇలాంటివి అనగా మండలంలోని పిల్లలు తక్కువ ఉండి, ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్న పాఠశాలల నుండి సర్దుబాటు చేయకుండా కేవలం మారుమూల గ్రామమైన ఇప్పలపల్లి విషయంలోనే కావాలని, కక్ష సాధింపు చర్యగా ఇలా చేస్తున్న మండల విద్యాధికారిపై తగు చర్యలు తీసుకుని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని ఉన్నత అధికారులను డిమాండ్ చేశారు. రాస్తారోకోతో వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసి చైర్మన్, పిల్లల తల్లిదండ్రులు, బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story