- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, మద్దూరు / కొత్తపల్లి : మద్దూరు, కొత్తపల్లి మండలాల్లో బుధవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల పై పీవో ఏపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు . మద్దూరు, ఎంపీడీవో రహమతుద్దీన్, కొత్తపల్లి ఎంపీడీవో కృష్ణారావు శిక్షణ తరగతులనుద్దేశించి మాట్లాడారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల నిర్వాణ గురించి అవగాహన కల్పించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం.. రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయని వివరించారు. ఇందులో మొదటి దశలో ప్రాదేశిక ఎన్నికలు , రెండవ దశలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఇట్టి ఎన్నికలు ఎన్నికల నియమావళి ప్రవర్తనను అనుసరించి ప్రిసైడింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని వారు సూచించారు. ఓటరు ఓటు వేసే విధానం గురించి వారు సమగ్రంగా వివరించారు. ప్రతి ఓటరు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు తప్పనిసరిగా పెట్టాలని తద్వారా మరో ప్రాంతంలోని పోలింగ్ బూత్ లో ఓటు వేయకుండ నివారించవచ్చు అన్నారు. సర్పంచ్, వార్డు సభ్యులకు వేర్వేరుగా బ్యాలెట్ పత్రాలు ఉంటాయని వాటిని ఓటర్లకు వివరించాలని పీవోలకు వివరించారు. అనంతరం పిఓ లకు ఎన్నికల శిక్షణ పత్రాలను అధికారులు అందజేశారు.






