ఈ ఎన్నికలు వారికి అగ్నిపరీక్షే

by Ratna Kumari |

దిశ, గట్టు : రాబోయే జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ, స‌ర్పంచ్, వార్డు మెంబ‌ర్ ల ఎన్నిక‌లు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు అగ్ని ప‌రీక్ష‌గా

ఈ ఎన్నికలు వారికి అగ్నిపరీక్షే
X

దిశ, గట్టు : రాబోయే జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ, స‌ర్పంచ్, వార్డు మెంబ‌ర్ ల ఎన్నిక‌లు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప‌ట్టు సాధించేందుకు ప్ర‌ధాన పార్టీలు అన్నీ కూడా వ్యూహాలు చేస్తున్నాయి. ఈ ఎన్నిక‌లే రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంకేతాలుగా మార‌నున్నాయి. ప్ర‌ధానంగా ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో గ‌ద్వాల, అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే స్తానాలు గెలుపొంద‌గా.. మిగ‌తా స్థానాలు అన్నింటిలో ఓట‌మి పాలైంది బీఆర్ఎస్. గ‌ద్వాల నుంచి బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి, ఆలంపూర్ నుంచి విజేయుడు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. గ‌ద్వాల నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది.

మ‌రోవైపు గ‌ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి తాను అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డితో క‌లిసి ప‌ని చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి స‌రిత‌, ఎమ్మెల్యే కృష్ణ మోహ‌న్ రెడ్డిల మ‌ధ్య పోటీ నెల‌కొంది. గ‌ద్వాల ఎమ్మెల్యే బండ్ల అనుచ‌ర వ‌ర్గానికి బీ ఫారాలు అందుతాయా..? నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జీ స‌రిత వ‌ర్గానికి బీ ఫారాలు అందుతాయా..? అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. వీరిద్ద‌రి మ‌ధ్య స‌యోద్య కుదురుతుందా.. లేదా గ‌ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డికి ప్రాధాన్య‌త ఇస్తుందా అనేది ఉత్కంఠ‌గా మారింది. నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జీ స‌రిత‌కు మొండిచేయి చూపిస్తే.. ఆమె అనుచ‌ర వ‌ర్గం ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తుందా..? లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మ‌రీ ఏం జ‌రుగుతుంద‌నేది వేచి చూడాలి.

Next Story