స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి : మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్

by Nallavelli.Anjaneyulu |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గురువారం

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి : మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో నిర్వహించిన హన్వాడ మండల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉందని, ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలకు 'కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు' ను ఇచ్చి ప్రభుత్వం చేసిన మోసం వివరించాలన్నారు. పదేండ్ల కాలంలో గ్రామాలు, మండలాల్లో చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ బాలరాజు, మాజీ జడ్పీటీసీ నరేందర్, పార్టీ మండలం అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, చెన్నయ్య, లక్ష్మయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Next Story