బాలల హక్కులు కోసం 'లిసెన్ టు చిల్డ్రన్' : కలెక్టర్ విజయేందిర బోయి

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బాలలకు హక్కులు ఉంటాయని, వారి అభిప్రాయాలను, ఎదురయ్యే సమస్యలను గుర్తించి క్రోడీకరించి, విశ్లేషణ చేసి ఇతర శాఖల సమన్వయంతో వాటిని పరిష్కరించడానికి

బాలల హక్కులు కోసం లిసెన్ టు చిల్డ్రన్ : కలెక్టర్ విజయేందిర బోయి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బాలలకు హక్కులు ఉంటాయని, వారి అభిప్రాయాలను, ఎదురయ్యే సమస్యలను గుర్తించి క్రోడీకరించి, విశ్లేషణ చేసి ఇతర శాఖల సమన్వయంతో వాటిని పరిష్కరించడానికి గురువారం అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా యూనిసెఫ్ సహకారంతో ప్రయోగాత్మకంగా 'లిసెన్ టు చిల్డ్రన్' అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 17 మండలాల్లో, మహబూబ్ న‌గ‌ర్ నగర పాలక సంస్థ తో పాటు మూడు మున్సిపాల్టీల్లో 22 చోట్ల గురువారం ఉదయం10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆమె తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్, వైద్య, ఆరోగ్య, విద్య, పంచాయతీ శాఖ, ఇతర శాఖల సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఇందులో భాగంగా ప్రతి మండలం, మున్సిపాలిటీల్లో, నగరపాలక సంస్థ 3 చోట్ల ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. వయసు ఆధారంగా 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు కలిగిన బాలురు 15 మంది ఒక గ్రూప్ గా, 15 మంది బాలికలు ఒక గ్రూప్ గా, 16 నుండి 18 వయసు కలిగిన బాలురు 15 మంది ఒక గ్రూప్ గా, బాలికలు 15 మంది ఒక గ్రూప్ గా మొత్తం 60 మంది బాల బాలికలు 4 గ్రూప్ లుగా ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. గ్రూప్ కు 3 గురు టీచర్లు సంధానకర్తలుగా వ్యవహరిస్తారని, పంచాయితీ కార్యదర్శులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొంటారని ఆమె తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని, ముగింపు ఎంపిడిఓ లు, త‌హ‌శీల్దార్లు మండల అధికారులు, ఇతర శాఖలు కూడా పాల్గొంటారని తెలిపారు. మున్సిపల్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో 'సూచనల బాక్సు' ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ బాక్సుల్లో సలహాలు, సూచనలు, సమస్యలను పిల్లల కోసం అందించవచ్చని, అలాగే హెల్ప్ లైన్, వాట్సాప్ నెంబర్ 9154784095 కు కూడా తెలపవచ్చని కలెక్టర్ వివరించారు.

Next Story