- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లయన్స్ క్లబ్ సేవలు మరువలేనివి : ఎమ్మార్వో ఉమా
దిశ, చారకొండ : సామాజిక సేవలో లయన్స్ క్లబ్ ది ప్రత్యేక పాత్ర అని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ జూలూరు రమేష్ బాబు, తహశీల్దార్ ఉమా, ఎస్సై వీరబాబు అన్నారు. శనివారం చారకొండ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్

దిశ, చారకొండ : సామాజిక సేవలో లయన్స్ క్లబ్ ది ప్రత్యేక పాత్ర అని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ జూలూరు రమేష్ బాబు, తహశీల్దార్ ఉమా, ఎస్సై వీరబాబు అన్నారు. శనివారం చారకొండ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ కల్వకుర్తి, లయన్స్ క్లబ్ ఆమనగల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను అభినందించడంతో పాటు ప్రజలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరంలో 265 మందికి ఉచితంగా డయాబెటిక్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు చిగుళ్ల పల్లి శ్రీధర్, జోన్ చైర్మ న్ జూలూరి లింగయ్య, చార్టర్ ప్రెసిడెంట్ కల్మచర్ల రమేష్, ప్రచార కార్యదర్శి గణేష్, మేకల శ్రీనివాస్, గందె రవి, క్యాంపు చైర్మన్ వాడకట్టు సంపత్ కుమార్ నిర్వాహకులు శ్యాంసుందర్, రాముని రామనాథం మాజీ జడ్పీటీసీ వెంకట్ గౌడ్, మాజీ ఎంపీటీసీ బలరాం, గజ్జె యాదయ్య, మండల ఆర్య సంఘ అధ్యక్షుడు రాచమల్ల చంద్రశేఖర్, లక్ష్మణ్, జేసీబీ వెంకటయ్య పాల్గొన్నారు.






