ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ లైన్ మెన్

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-10-14 12:15:54  IST  )

దిశ, వంగూరు : లైన్ మేన్ ఏసీబీకి చిక్కిన ఘ‌ట‌న వంగూరు మండ‌ల ప‌రిధిలోని మాచివోని ప‌ల్లి గ్రామ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా వంగూరు మండ‌లం

ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ లైన్ మెన్
X

దిశ, వంగూరు : లైన్ మేన్ ఏసీబీకి చిక్కిన ఘ‌ట‌న వంగూరు మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా వంగూరు మండ‌ల ప‌రిధిలోని మాచినేని ప‌ల్లి గ్రామానికి చెందిన‌ రైతు రాజు త‌న పొలంలో ట్రాన్స్ ఫార్మార్ ఏర్పాటు చేసేందుకు ద‌రఖాస్తు చేశాడు. అయితే అత‌నికి ట్రాన్స్ ఫార్మ‌ర్ మంజూరు అయింది. ఆ ట్రాన్స్ ఫార్మర్ ని ఫార్మాలిటీస్ ప్ర‌కారం.. ఇవ్వాలంటే రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు లైన్ మేన్. దీంతో రూ.20వేలు ఇవ్వ‌లేనని రైతు కోర‌గా.. రూ.15వేలు ఇవ్వాల‌ని లైన్ మేన్ డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. మంగ‌ళ‌వారం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అవినీతి నిరోధ‌క శాక డీఎస్పీ బాల‌కృష్ణ సారధ్యంలో సిబ్బంది ప‌త‌కం ప్ర‌కారం.. డ‌బ్బులు ఇచ్చారు. వెంట‌నే లైన్ మేన్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రైతు ఫిర్యాదు మేర‌కు లైన్ మేన్ పై కేసు న‌మోదు చేశామ‌ని, బుధ‌వారం కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు డీఎస్పీ బాల‌కృష్ణ వెల్ల‌డించారు.

Next Story