- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ,కోస్గి: పట్టణంలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుంది. నూతన గ్రంథాలయ భవనం నిర్మాణం పూర్తి అయినా సరే అది ఇంకా ప్రారంభానికి నోచుకోక స్థానిక ఐబి గెస్ట్ హౌస్ని శాఖ గ్రంథాలయంగా ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇది పాత భవనం కావడం వల్ల ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పెచ్చులూడి పడుతోంది. ఎప్పుడు ఎవరి మీద పడుతాయో అని ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు. స్థానిక అధికారులు, నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేసి త్వరగా గ్రంథాలయాన్ని కొత్త భవనంలోకి మార్చాలని పాఠకులు, నిరుద్యోగ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే పోటీ పరీక్షల నిమిత్తం కొత్త సిలబస్ ప్రకారం బుక్స్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Next Story






