పోలీస్ పీఆర్ఓ శ్రీనివాస్ కు ప్రశంసా పత్రం

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : గత మూడు రోజులుగా హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహించిన పీఆర్ఓ ల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న మహబూబ్ నగర్ పోలీస్ ప్రధాన కార్యాలయం

పోలీస్ పీఆర్ఓ శ్రీనివాస్ కు ప్రశంసా పత్రం
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : గత మూడు రోజులుగా హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహించిన పీఆర్ఓ ల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న మహబూబ్ నగర్ పోలీస్ ప్రధాన కార్యాలయం పీఆర్ఓ ఎస్.శ్రీనివాసులు కు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మూడు రోజులుగా నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన సఫలంగా పాల్గొని ప్రతిభ కనబరిచినందుకు ముగింపు రోజు ఆయనకు డీజీపీ శివధర్ రెడ్డి ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి మాట్లాడుతూ శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను పోలీస్ ప్రజా సంబంధాల పనిలో ఉపయోగించి మరింత చురుకుగా పనిచేయాలని సూచిస్తూ అభినందించారు.

Next Story