ఏకాభిప్రాయంతో రండి.. 12వేలు ప‌ట్టుకెళ్లండి..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-10-05 09:06:35  IST  )

దిశ, ముక్త‌ల్ : తాము పోటీ చేసే స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీటీసీ స్థానంలో ఒక్కరినే పైనల్ చేస్తే.. వారికి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రూ. 12వేల నగదును ఎన్నికలు ఖర్చు

ఏకాభిప్రాయంతో రండి.. 12వేలు ప‌ట్టుకెళ్లండి..!
X

దిశ, మక్త‌ల్ : తాము పోటీ చేసే స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీటీసీ స్థానంలో ఒక్కరినే పైనల్ చేస్తే.. వారికి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రూ. 12వేల నగదును ఎన్నికలు ఖర్చు చేయడానికి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గణేష్ కుమార్ తెలిపారు. అయితే మ‌క్త‌ల్ మండ‌లం జ‌డ్పీటీసీ స్థానం జ‌న‌ర‌ల్ కావ‌డంతో దాదాపు 12 మంది పోటీ చేసేందుకు ఆస‌క్తిక‌న‌బ‌రుస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌క్త‌ల్ మండ‌లంలో 15 ఎంపీటీసీ స్థానాలుండ‌గా.. వాటిలో పోటీ చేసే అభ్య‌ర్తిని ఒక్క‌రినే ఫైన‌ల్ చేస్తే.. ఆ ఎంపీటీసీ స్థానంలో రెబ‌ల్ అభ్య‌ర్థి లేకుండా ఆ స్థానాన్ని సులువుగా గెలుచుకుంటుంద‌ని.. అభ్య‌ర్థి గెలుపున‌కు అంద‌రూ ప‌ని చేయాల‌ని అధ్యక్షుడు తెలిపారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున స్థానికంగా మంత్రి ఉన్నందున ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ స్థానాల‌ను ప‌రిశీలించి ఒకే అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డం అధిష్టానానికి త‌ల‌నొప్పిగా ఉంటుంద‌ని.. ఆయా స్థానాల‌కు పోటీ విప‌రీతంగా పెరిగింది. ముఖ్యంగా ఎవ‌రికి పార్టీ బీ ఫామ్ ఇస్తే.. వారే బ‌రిలో ఉన్న‌ట్టు లెక్క‌. ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం పార్టీ రూ.12వేల వ‌ర‌కు ఇవ్వ‌నుంద‌నిమండ‌ల అధ్య‌క్షుడు గ‌ణేష్ కుమార్ తెలిపారు.

Next Story