- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జేపల్లిని ఆదర్శంగా తీరిదిద్దుతాం : సర్పంచ్ అమీన అశోక్ రాథోడ్
మండలంలోని జేపల్లి గ్రామపంచాయతీలో నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు గ్రామ సర్పంచ్ అమీనా అశోక్ రాథోడ్ అధ్యక్షత వహించారు.

దిశ, చారకొండ : మండలంలోని జేపల్లి గ్రామపంచాయతీలో నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు గ్రామ సర్పంచ్ అమీనా అశోక్ రాథోడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అమీనా అశోక్ రాథోడ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను క్రమంగా పరిష్కరించి జేపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామపంచాయతీగా ప్రజల సహకారం తో తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం అర్హులైన పేదలకే అందేలా కృషి చేస్తామని తెలిపారు. నూతన పాలకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధి కోసం నిత్యం ప్రజా మౌలిక సమస్యలపై పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ దివ్య, పంచాయతి కార్యదర్శి మల్లేష్, ఉప సర్పంచ్ వంకేశ్వరం మధు, వార్డు సభ్యులు భాస్కర్, వరికుప్పల నరేష్, రాట్లావత్ శీను, మల్లెపాకుల జంగమ్మ, నాయకులు మహమ్మద్ సిరాజ్, మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు రాట్లావత్ పాండు, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ వంకేశ్వరం రమేష్, యువకులు ప్రశాంత్, రాకేష్, యాదగిరి, గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.






