- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధిద్దాం : కేఎం నారాయణ
దిశ, మహమ్మదాబాద్/గండీడ్ : బీసీ సంఘాల పిలుపు మేరకు ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న సంపూర్ణ బంద్‌కు మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ

దిశ, మహమ్మదాబాద్/గండీడ్ : బీసీ సంఘాల పిలుపు మేరకు ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న సంపూర్ణ బంద్‌కు మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం నారాయణ మద్దతు ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించేందుకు ప్రతి ఒక్కరు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో న్యాయమైన వాటా లభించేందుకు బంద్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సంఘాల పోరాటానికి మహమ్మదాబాద్ మండలంలోని వ్యాపారవేత్తలు, విద్యాసంస్థలు, ప్రజాసంఘాలు స్వచ్ఛందంగా మద్దతు తెలపాలని కోరారు. శనివారం ఉదయం 9:30 గంటలకు మహమ్మదాబాద్ బస్‌స్టాండ్ వద్ద బంద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, సామాజిక సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని కేఎం నారాయణ పిలుపునిచ్చారు.






