బీసీ సంఘాల నాయ‌కుల ధ‌ర్నా

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-10-10 11:18:49  IST  )

దిశ, మద్దూరు / కొత్తపల్లి : మద్దూరు, కొత్తపల్లి మండల కేంద్రాల్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాధవరెడ్డి

బీసీ సంఘాల నాయ‌కుల ధ‌ర్నా
X

దిశ, మద్దూరు / కొత్తపల్లి : మద్దూరు, కొత్తపల్లి మండల కేంద్రాల్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాధవరెడ్డి వేసిన పిటీషన్ ను ఆధారంగా చేసుకుని హైకోర్టు గురువారం జీవో నెం. 9 అమలుపై స్టే విధించడంతో శుక్రవారం బీసీ సంఘాల నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు రాములు, గోపాల్, నరసింహ, భవాని శంకర్, భీంషన్, సాయిలు మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో-9 చెల్లదని సీఎం రేవంత్‌ రెడ్డికి ముందే తెలుసని, బీసీ రిజర్వేషన్ల పెంపుతో 50 % పరిమితి దాటుతున్నదని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని తెలిసి కూడా ముఖ్యమంత్రి బీసీ సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.

రిజర్వేషన్ల కోటా పరిమితిని ఎత్తివేసే అధికారం రాష్ట్ర క్యాబినెట్‌కు లేదని, రెండు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదించరని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. అలాగే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 % రిజర్వేషన్ కల్పించడాన్ని రెడ్డి సామాజిక వర్గం అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా కింద 2% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 % రిజర్వేషన్ కల్పించిన కూడా బీసీలు అడ్డుకోలేదని, 52% పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో మాత్రమే 42% రిజర్వేషన్ కల్పించడానికి వ్యతిరేకిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ల సాధన కోసం రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు నారాయణ, బసప్ప, సాయిలు, భీంషన్, వెంకటయ్య, రాజశేఖర్, రఘు చారి, శ్రీనివాస్, ఎల్లప్ప, పురుషోత్తం, లాలు, కనకప్ప తదితరులు పాల్గొన్నారు.

Next Story