ప్ర‌తి రోజు వ్యాయామం అంద‌రికీ అవ‌స‌రం : ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి దమ్ము ఉపనిషధ్వాని

by Ratna Kumari |

దిశ‌, కొల్లాపూర్ : రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు కొల్లాపూర్ కోర్టుల ప్రాంగణంలో

ప్ర‌తి రోజు వ్యాయామం అంద‌రికీ అవ‌స‌రం :  ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి దమ్ము ఉపనిషధ్వాని
X

దిశ‌, కొల్లాపూర్ : రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు కొల్లాపూర్ కోర్టుల ప్రాంగణంలో “సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ దినోత్సవం – 2025” ను పురస్కరించుకొని మండల న్యాయ సేవా అధికార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి దమ్ము ఉపనిషధ్వాని మాట్లాడుతూప్రతిరోజూ వ్యాయామం, తగిన నిద్ర, పోషకాహారం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు… ఇవే ఆరోగ్యకరమైన జీవితానికి మౌలిక సూత్రాలు. ముఖ్యంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఆరోగ్య శాఖకు చెందిన వైద్యులు జననీ శిశు సురక్షా కార్యక్రమం, మాతా–శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం, ప్రధాని మాతృత్వ అభియాన్, క్షయ, కుష్టు నియంత్రణ, కీటకజనిత వ్యాధులు (మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫై లేరియా, మెదడు వాపు), అలాగే ఆసంక్రమిక (NCD) వ్యాధులు, మధుమేహం, రక్తపోటు వంటి అంశాలపై విస్తృతంగా సమాచారాన్ని అందించారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సదస్సుకు హాజరైన 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర్. శరణ్య, ఏపీపీ బి. శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోతుల నాగరాజు, న్యాయవాదులు కె. మోహన్ లాల్, యన్. నిరంజన్, జె.సి. కుర్మయ్య, వి. మధుసూదన్ రావు, వి.వి. శ్రీనివాస రావు, AGP పి. గోవింద్, ఎస్. రాజేష్, ఎస్. నళిని, కె. వసంత రెడ్డి, వి. ఉపేందర్, న్యాయ శాఖ సిబ్బంది హాజరయ్యారు.

Next Story