- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్టి దిబ్బ కూలి వ్యక్తి మృతి..
వీపనగండ్ల మండల కేంద్రం సమీపంలోని బీమా కాలువ వద్ద మట్టి దిబ్బ కూలి ఓ వ్యక్తి మృతిచెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది.

దిశ, వీపనగండ్ల : వీపనగండ్ల మండల కేంద్రం సమీపంలోని బీమా కాలువ వద్ద మట్టి దిబ్బ కూలి ఓ వ్యక్తి మృతిచెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ వివరాలను ఎస్సై కే. రాణి మీడియాకు వెల్లడించారు. వీపనగండ్ల గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు బాపూజీ గౌడ్ తన భూమికి నీరు తేవడానికి బీమా ప్రధాన కాలువ నుండి పైప్ లైన్ వేసే పని చేపట్టారు. ఈ పనుల కోసం జెసిబితో కాలువ తవ్వించగా, కూలీగా పనిచేస్తున్న నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భోగమోనిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (42) తవ్విన కాలువలోకి దిగాడు.
మట్టిని తీస్తుండగా అచట ఏర్పడిన మట్టి దిబ్బ ఒక్కసారిగా వెంకటేష్‌పై పడింది. తీవ్ర గాయాలకి లోనైన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత వెంకటేష్‌ను బయటకు తీసి పోస్టుమార్టం కోసం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకటేష్‌కి భార్యతో పాటు ఓ కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు.






