లేబర్ కోడ్ లు వెంటనే రద్దు చేయాలి : CPM

by Nallavelli.Anjaneyulu |

లేబ‌ర్ కోడ్ లు వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి వెంక‌ట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.

లేబర్ కోడ్ లు వెంటనే రద్దు చేయాలి : CPM
X

దిశ‌, నారాయ‌ణ‌పేట ప్ర‌తినిధి : కేంద్ర కార్మిక సంఘాలు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ,సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుమేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలో వందలాది మంది మున్సిపల్ పార్క్ దగ్గర సభ జరుపుకొని మహా ర్యాలీగా వీర సావర్కర్ చౌరస్తా మీదుగా సత్యనారాయణ చౌరస్తా కు చేరుకోని అక్కడ జరిగిన నిరసన సభ లో సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామి రెడ్డి మాస్ లైన్ జిల్లా నాయకులు కాశీనాథ్ సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రసంగించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు తెచ్చి కార్మిక వర్గంపై యుద్ధం చేస్తుందని, మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని దివాలా తీయించడానికి, కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికి, ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించడానికి, బ్యాంకులను కుదించడం, ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ బహుళ జాతి కంపెనీలను ఆహ్వానించి దేశ సంపాదన మొత్తం విదేశాలకు కట్టబెట్టడానికి, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాడని, ఎనిమిది గంటల పనిని పెంచడం, కనీస వేతనాలు లేకుండా యాజమాన్యాలు మోసం చేయడానికి, సంఘం పెట్టుకునే హక్కులు ,పోరాడే హక్కులు ,భేరసారాల హక్కులు హరిస్తున్నాడని, బ్రిటిష్ వాడిచ్చిన సమ్మె హక్కు, సంగం పెట్టుకునే హక్కును కూడా కాలరాయడాన్ని, ఉద్యోగ కార్మిక వర్గం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

ఈ సమ్మె దేశభక్తి పూరితమైన సమ్మె అని కొనియాడారు. దేశ వ్యాప్తంగా సమ్మెలో 40కోట్ల మంది కష్టజీవులు పాల్గొన్నారని, జిల్లాలో పలు పరిశ్రమలు బ్యాంకులు షాపింగ్ మాల్ ఇతర వాణిజ్య సంస్థలు మూతపడ్డాయని సుమారు 50 కోట్ల రూపాయలు నష్టపోయారని, పెట్టుబడుదారులకు, కార్పొరేట్లకు,విదేశీ బహుళ జాతి కంపెనీలకు లాభాలు చేకూర్చడమే ధ్యేయంగా లేబర్ కోడ్లు తెచ్చాడని, మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 14 గంటలు పని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెచ్చాడని, సంఘం లేకుండా చేయడము, పోరాడే హక్కులు నిర్వీర్య పరచడము ,పీఎఫ్, ఈఎస్ఐ ,బోనసు, గ్రాటిటీ ,పెన్షన్లపై దాడి చేయడం అత్యంత దుర్మార్గం అన్నారు. 18000 వేలు వేతనం పొందే వారిని కార్మికుడుగా గుర్తించకుండా, సూపర్వైజర్ గా అర్థం మార్చాడని, దీనిని తీవ్రంగా ఖండించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ యాదగిరి రైతుసంఘాల జిల్లా జర్య దర్శులు అంజిలయ్య గౌడ్,ప్రశాంత్,Po.w జిల్లా కార్యదర్శి జయలక ఇన్సూరెన్స్ రంగo ల్లో ,బ్యాంకు రంగంల్లో ప్రైవేటు బ్యాంకులు, ప్రైవేట్ భీమా కంపెనీలను విస్తృతంగా ప్రవేశపెట్టాడని, మరోవైపున ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరిస్తూ నిర్వీర్య పరుస్తున్నారని, ఎల్ఐసి ,పోస్టల్ టెలికం ,రైల్వే విద్యుత్తు, బొగ్గు చబురు, విమానయానం తదితర వాటిల్లో ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తున్నదని వారు తీవ్రంగా మోడీ గవర్నమెంట్ ను విమర్శించారు. మోడీ గో బ్యాక్ , బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ పాలసీలు వెనక్కి తీసుకోవాలనీ, లేబర్ కోడ్లు రద్దు చేయాలని అన్నారు. అంగన్‌వాడీ,ఆశా ,ఉపాధి హమీ క్షేత్ర సహాయకులు, గ్రామ పంచాయతీ, మునిసిపల్ కార్మికులు, భవన నిర్మాణ మిషన్ భగీరథ కార్మికులు,మధ్యాహ్న బోజన కార్మికులు వీవోఏ, మెప్మా ఆర్పీలు 1200 మంది పాల్గొన్నారు.

Next Story