- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవిగో నీ అక్రమాలు..!
ఇదిగో నీ అవినీతి భాగోతానికి ఆధారాలు దమ్ముంటే చర్చకు సిద్ధమా అంటూ బీఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సవాల్ విసిరారు.

దిశ, నగర్ కర్నూల్ కలెక్టరేట్ : ఇదిగో నీ అవినీతి భాగోతానికి ఆధారాలు దమ్ముంటే చర్చకు సిద్ధమా అంటూ బీఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్ల మట్టి అక్రమాలకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపుతూ మాట్లాడారు. స్వగ్రామం నేరేళ్లపల్లి గ్రామంలో 70 లక్షలకు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని 50 లక్షలు తీసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువు శిఖం భూములు నల్లమట్టిని అడ్డగోలుగా తవ్వేరని తద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని మండిపడ్డారు.
ప్రాజెక్టు నిర్మాణం కోసమే నల్లమట్టి తీసినట్లైతే ఏఏ చెరువులో ఎంత మేర నల్లమట్టి బయటకు తీసారో ఎంత మేర ప్రభుత్వానికి నగదు చెల్లించారో, శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలతోనే కొనసాగుతుందని ప్రజలు ఈ విషయాలను గుర్తు ఎరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇల్లు ఇస్తారా ఇవ్వరా ? మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము జర్నలిస్టులకు బాండు రాసిస్తాం. విలేకరులను మోసం చేస్తే సహించేది కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి బోనాసి రామచందర్, జిల్లా అధ్యక్షులు కారంగి బ్రహ్మయ్య, అసెంబ్లీ అధ్యక్షులు బండి పృథ్వీరాజ్ మండల అధ్యక్షులు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.






