CM పర్యటనకు భారీ ఏర్పాట్లు

by S Gopi |   (  Updated:2022-12-04 02:50:36  IST  )

సమీకృత నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆదివారం జిల్లాకు వస్తున్న...KCR to visits Mahaboobnagar today

CM పర్యటనకు భారీ ఏర్పాట్లు
X

దిశ, మహబూబ్ నగర్: సమీకృత నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆదివారం జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేశారు. 30 ఎకరాలలో, దాదాపు 50 కోట్ల రూపాయలతో, 32 వివిధ శాఖల కార్యాలయాలతో సమీకృత నూతన కలెక్టర్ కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. మహబూబ్ నగర్ పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భారీ కటౌట్లు, గులాబీ జెండాలు, పెద్ద పెద్ద స్వాగత బ్యానర్లతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. పార్టీ నూతన కార్యాలయాన్ని, పాత కలెక్టర్ కార్యాలయం స్థానంలో ప్రభుత్వ కొత్త కార్పోరేట్ ఆసుపత్రికి శంఖుస్థాపన కార్యక్రమాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం ఎంవీఎస్ కాలేజీ మైదానంలో జరుగనున్న భారీ బహిరంగ సభకు లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. అన్ని ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పరిశీలించారు.


Read More.....

బిడ్డా.. భయపడకు! ఫోన్లు ఎందుకు మార్చారని అడిగితే ఇలా సమాధానం చెప్పు!!

Next Story