- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మీ పథకం
ఉప్పునుంతల మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మీ చెక్కులను అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పంపిణీ చేశారు.

దిశ, ఉప్పునుంతల : ఉప్పునుంతల మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మీ చెక్కులను అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పంపిణీ చేశారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు మొత్తం 103 కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాల అమ్మాయిల వివాహాలకు ఆర్థికంగా తోడ్పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలకు ఉపశమనం కలుగుతోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో అద్దంకి సునీత, మామిళ్ళపల్లి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ వేముల నరసింహారావు, డైరెక్టర్ గణేష్ గౌడ్, మామిళ్ళపల్లి సర్పంచ్ మోకురాల మోహన్ గౌడ్, దేవదారీకుంట సర్పంచ్ మంగమ్మ రతన్ సింగ్, అచ్చంపేట వ్యవసాయ కమిటీ డైరెక్టర్ రత్లావత్ కృష్ణ, దాసర్లపల్లి సర్పంచ్ రమేష్ రెడ్డి, మామిళ్ళపల్లి దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ గంగుల నరసింహారెడ్డి పాల్గొన్నారు.






