జేపీఎన్సీఈ లోని ప్రతి విద్యార్థికి ఉద్యోగావకాశాలే లక్ష్యం : చైర్మన్ రవికుమార్

by Ratna Kumari |

మహబూబ్ నగర్ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థికి ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యం అని కళాశాల చైర్మన్ కే.ఎస్. రవికుమార్ అన్నారు.

జేపీఎన్సీఈ లోని ప్రతి విద్యార్థికి ఉద్యోగావకాశాలే  లక్ష్యం :   చైర్మన్ రవికుమార్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థికి ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యం అని కళాశాల చైర్మన్ కే.ఎస్. రవికుమార్ అన్నారు. వేసవి సెలవుల అనంతరం కళాశాలకు తిరిగి వచ్చిన విద్యార్థులతో ఆయన ప్రత్యేక ముఖాముఖి నిర్వహించి, విద్యా లక్ష్యాలు, భవిష్యత్ అవకాశాలు పై వారికి దిశానిర్దేశం చేశారు. కళాశాలలో చదివే ప్రతి విద్యార్థిని సాన పట్టడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, ప్రాబ్లెమ్స్ సాల్యూవేషన్ కు చిట్కాలను సూచిస్తున్నామని అన్నారు. గత విద్యా సంవత్సరంలో 569 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మేంట్ల ద్వారా ఉద్యోగాలు సాధించడం ద్వారా జాబ్ గ్యారంటీ భరోసా కల్పించామని ఆయన అన్నారు. టిసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సంస్థల్లో కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు పొందడం గర్వకారణం అని ఆయన అన్నారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంపొందించుకోవాలని సూచించారు. 'నెక్ట్సువేవ్, టిసీఎస్ ఐకాన్, ఐబీఎం, టాస్క్' కంపెనీలు తమ ట్రైనింగ్ పార్టనర్స్ అని, తెలంగాణ లోనే 'బెస్ట్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల' గా కేంద్ర ప్రభుత్వ అవార్డు పొందిందని ఆయన గర్వంగా తెలిపారు.

Next Story