ఉత్తమ ఫలితాలే జెపీఎన్సీఈ కళాశాల లక్ష్యం : చైర్మన్ రవికుమార్

by Nallavelli.Anjaneyulu |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఉత్తమ ఫలితాలు సాధించడమే జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల లక్ష్యం అని కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జెపీ ఎన్సీఈ కళాశాలలో 'ఇంజనీరింగ్

ఉత్తమ ఫలితాలే జెపీఎన్సీఈ కళాశాల లక్ష్యం : చైర్మన్ రవికుమార్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఉత్తమ ఫలితాలు సాధించడమే జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల లక్ష్యం అని కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జెపీ ఎన్సీఈ కళాశాలలో 'ఇంజనీరింగ్ విద్య, ప్రాముఖ్యత' గురించి నిర్వహించిన సెమినార్ లో, పట్టణంలోని రిషి జూనియర్ కళాశాల, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, కెజిబీవీ జూనియర్ కళాశాల విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు.1997 లో ప్రారంభించిన కళాశాలలో 2026 నాటికి 30 వ బ్యాచ్ ప్రారంభించబోతున్నామని ఆయన సంతోషం వ్యక్తంచేశారు. గత సంవత్సరం యూజీసీ అటానమస్ స్టాటస్ సాధించిన ఘనత తమ కళాశాలకు దక్కిందని, చివరి సంవత్సరం చదువుతున్న 3 గురు విద్యార్థులకు 'ఇన్ఫోసిస్' కంపెనీ కు ఎంపికైనట్లు, జెపిఎన్సీఈ కళాశాలలో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా జాబ్ గ్యారెంటీ అన్న నమ్మకాన్ని కలుగజేశామని ఆయన తెలిపారు. ఇన్ఫోసిస్ కు ఎంపికైన భార్గవి మాట్లాడుతూ, జెపిఎన్సీఈ అకాడమిక్ తో పాటు 'ఇండస్ట్రీ విజిస్ట్స్, హక్తోనస్ ప్రాజెక్ట్స్, టాస్క్, ఎన్.ఎక్స్.టీ వేవ్' ద్వారా తన విజయానికి దోహదం చేసిందని వివరించారు. అనంతరం కళాశాల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్లెస్మెంట్ ఆఫీసర్ డాక్టర్.గురురాఘవేంద్రా రెడ్డి, విఇ చంద్రశేఖర్, వెంకటేష్, వివిధ‌ కళాశాల ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story