ఇంట‌ర్ త‌రువాత ఎన్టీఆర్ ప్ర‌భుత్వ మ‌హిళా డిగ్రీ క‌ళాశాల‌లో చేరండి : ప్రిన్సిపాల్ ముంతాజ్ జ‌హ‌న్

by Ratna Kumari |

ఇంట‌ర్ త‌రువాత ఎన్టీఆర్ ప్ర‌భుత్వ మ‌హిళా డిగ్రీ క‌ళాశాల‌లో చేరండి అని ప్రిన్సిపాల్ ముంతాజ్ జ‌హ‌న్ విద్యార్థుల‌కు సూచించారు.

ఇంట‌ర్ త‌రువాత ఎన్టీఆర్ ప్ర‌భుత్వ మ‌హిళా డిగ్రీ క‌ళాశాల‌లో చేరండి : ప్రిన్సిపాల్ ముంతాజ్ జ‌హ‌న్
X

దిశ‌, మహబూబ్ నగర్ ప్రతినిధి : మెరుగైన బోధన, డిజిటల్ లైబ్రరీ, అన్ని సౌకర్యాలతో ల్యాబ్ లు, ప్లేస్ మెంట్ సెల్, క్యాంటిన్ వంటి తదితర వసతులతో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా బోధిస్తున్న ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ అండ్ పీజీ అటానమస్ కళాశాలలో చేరాలని కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ అమీనా ముంతాజ్ జహన్ కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని రాష్ట్ర కమీషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ వారి ఆదేశానుసారం శనివారం కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రచార సమావేశంలో ఆమె కర పత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. పట్టణ నడిబొడ్డున బస్ స్టాండ్ ప్రక్కన, సమీపంలో రైల్వే స్టేషన్ ఉన్న తమ కళాశాలలో విశాలమైన మైదానం, డిగ్రీ తర్వాత ఇక్కడే పీజీ కోర్సులతో పాటు ఉపాధికి దోహదపడే వినూత్నమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు. 61 గదులతో, 31 లెక్చర్ హాల్స్,13 ప్రయోగశాలల తో ప్రత్యేక జిమ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, డిజిటల్ తరగతులతో బోధన ఉంటుందని ఇంటర్మీడియట్ పూర్తి అయిన, కాబోతున్న విద్యార్థినీలు తమ ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చేరి ఉన్నతంగా స్థిరపడాలని ప్రిన్సిపాల్ విజ్ఞప్తి చేశారు.

Next Story