ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయండి

by velandi.Saikiran |

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు వైద్యుల కృషి చేయాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ ఆదేశించారు.

ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయండి
X

దిశ, ఇటిక్యాల: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు వైద్యుల కృషి చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బి ఎం సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయు సిబ్బంది సమయపాలన పాటించాలని ప్రజలకు నాణ్యమైన సత్వర సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఓపీ, ఐపి రోగుల వైద్య సేవలు మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రసవాల సంఖ్యను పెంచాలని వంద శాంతం సాధారణ ప్రసవాలు చేయాలన్నారు.

గర్భిణుల ఆంటీనెంటల్ (ANC)కేర్ నమోదు ఖచ్చితంగా చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించి, అవసరమైన ఐరన్,కాల్షియం టాబ్లెట్లు సమయానికి అందించాలన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన అన్ని టాబ్లెట్లు ఉండాలని సూచించారు. గ్రామాలలో 30 సంవత్సరాలకు పైబడిన వారిని గుర్తించి వారిలో లో బి.పి, షుగర్ లాంటి వ్యాధులను గుర్తించి అవసరమైన మందులు అందజేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ఇటిక్యాల మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి భూ భారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు కలెక్టర్ సంతోష్. భూ భారతీ రికార్డులు స్పష్టంగా, అప్-టు-డేట్‌గా ఉంచడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలను సమయానికి, పారదర్శకంగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వీర భద్రప్ప, ఎంపీడీవో అజర్ మెహీనుద్దీన్,డాక్టర్ అనిరుధ్, రెవిన్యూ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story