- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుబాయిలో క్యాబ్ డ్రైవర్స్, బైక్ రైడర్స్ ఉద్యోగ అవకాశాలు..
TOMCOM ద్వారా దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్స్, బైక్ రైడర్ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తోందని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి తెలిపారు.

దిశ, గద్వాల కలెక్టరేట్: తెలంగాణ ప్రభుత్వం కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ద్వారా దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్స్ మరియు బైక్ రైడర్ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తోందని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి జి ప్రశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు 23 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు డ్రైవింగ్/రైడింగ్ అనుభవం, ప్రాథమిక ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. క్యాబ్ డ్రైవర్ల ఉద్యోగానికి 100 శాతం కంపెనీ ఆధారిత నియామకం ఉంటుంది. వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు కంపెనీ ద్వారా కల్పించబడతాయి.
అప్లికేషన్ వివరాలు...
నెలకు AED 2,500 నుండి AED 4,000 వరకు వేతనం (సుమారు రూ.64,850 నుండి రూ.1,03,770 వరకు) అందించబడుతుంది. బైక్ రైడర్ ఉద్యోగానికి కూడా 100 శాతం కంపెనీ ఆధారిత నియామకం ఉంటుంది. నెలకు AED 2,500 వరకు వేతనం (సుమారు రూ.64,850 వరకు) అందించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 25వ తేదీ 2026 లోపు దరఖాస్తు https://docs.google.com/forms/d/e/1FAIpQLSdF0IAtwr76Ylo0djElaIdMDzQo6o4-ohUJDHwj5PQy1COI_g/viewform?pli=1 సంబంధిత లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, పోలీస్ వెరిఫికేషన్/సిఐడి లేదా ఇతర సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440049520, 9440048590 నంబర్లను సంప్రదించవచ్చని జిల్లా ఉపాధి కల్పన అధికారి జి ప్రశాంతి తెలిపారు.






