ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాలి : డీవైఎఫ్ఐ

by Ratna Kumari |

దిశ‌, నిడ‌మ‌నూర్ : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డీవైఎఫ్ఐ నిడమనూరు మండల మహాసభలు బుధవారం ముకుందాపురంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు మల్లికంటి చంద్రశేఖర్

ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాలి : డీవైఎఫ్ఐ
X

దిశ‌, నిడ‌మ‌నూర్ : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డీవైఎఫ్ఐ నిడమనూరు మండల మహాసభలు బుధవారం ముకుందాపురంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు మల్లికంటి చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను హాజరై మాట్లాడారు. డీవైఎఫ్ఐ అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని పోరాటాలు చేస్తుందని నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడం లేదన్నారు. యువతకు స్వయం ఉపాధి కల్పించాలని వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేసి యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉపాధి అవకాశాలు లేక చదువుకున్న యువకులు గుమస్తాలుగా, డ్రైవర్లుగా, మెకానికులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈనెల 20, 21 తేదీల్లో తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహించే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలన్నారు. ఈ మహాసభలో మండల నూతన కమిటీని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షులుగా వెంపటి మహేష్, కార్యదర్శిగా మల్లి కంటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా కందుకూరు కోటేష్, శ్యామల రాజేష్, రొయ్య శ్రీను, నడ్డి నాగరాజు, సహాయ కార్యదర్శులుగా ఖమ్మంపాటి కోటేష్,లెంకలపల్లి పరిపూర్ణాచారి, కొండేటి నరేష్, సలికంటి కోటయ్య మరో 7 గురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్య‌క్ర‌మంలో వ్యాకాస జిల్లా సహాయ కార్యదర్శి కందుకూరు కోటేష్, సీఐటీయూ మండల నాయకులు ఇంజమూరి, శివ, డివైఎఫ్ఐ నాయకులు మాచర్ల కోటేష్ ధర్మారపు మధు, వెంకటేష్, గణేష్ పాల్గొన్నారు.

Next Story