- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇటిక్యాల ఎస్ఐ కి ‘ఉత్తమ సబ్ ఇన్‌స్పెక్టర్’ అవార్డు ప్రదానం
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల సబ్ ఇన్‌స్పెక్టర్ రవి కి జిల్లా స్థాయి ‘ఉత్తమ ఎస్ఐ’ అవార్డు లభించింది. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబరిచినందుకు నేరాల అదుపులో ప్రత్యేక చొరవ చూపినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

దిశ, ఇటిక్యాల : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల సబ్ ఇన్‌స్పెక్టర్ రవి కి జిల్లా స్థాయి ‘ఉత్తమ ఎస్ఐ’ అవార్డు లభించింది. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబరిచినందుకు నేరాల అదుపులో ప్రత్యేక చొరవ చూపినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సలహాదారులు, ఢిల్లీ అధికార ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ , జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా ఎస్ఐ ఈ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఇటిక్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి తనదైన శైలిలో సేవలందిస్తున్నారు. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగేలా ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాన్ని అమలు చేస్తూ, బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా చూస్తూ ప్రజలకు అవగాహన కల్పించి నేరాల గుర్తింపును సులభతరం చేసే ప్రజలకు మెరుగైన సేవలు అందించారు.
ఆయనలో ఈ అవార్డుకు ఎంపిక చేసి అవార్డు ప్రదానం చేశారు. ఉత్తమ ఎస్ఐ అవార్డు అందుకోవడంపై ఎస్ఐ రవి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని దీనికి కారణమైన ఎస్పీ, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం నా ఒక్కడిది కాదని.. ఇటిక్యాల పోలీస్ స్టేషన్ సిబ్బంది సమష్టి కృషి అని.. మండల ప్రజల సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు. భవిష్యత్తులో మరింత బాధ్యతగా పని చేసి మండలాన్ని నేరరహితంగా మార్చడానికి కృషి చేస్తానని తెలిపారు. ఇటిక్యాల ఎస్ఐ కి ఉత్తమ అవార్డు దక్కడం పట్ల మండల ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పోలీస్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.






