ప్ర‌జ‌ల ప్రాణాల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త : ఎస్సై విజ‌య్ కుమార్

by Nallavelli.Anjaneyulu |

దిశ, మద్దూరు : ప్ర‌జ‌ల ప్రాణాల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని ఎస్సై విజ‌య్ కుమార్ పేర్కొన్నారు. మ‌ద్దూరు ప‌ట్ట‌ణ కేంద్రంలో ఎస్సై విజ‌య్ కుమార్ ఆధ్వ‌ర్యంలో ఆటో డ్రైవ‌ర్ల‌కు రోడ్డు భ‌ద్ర‌త,

ప్ర‌జ‌ల ప్రాణాల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త : ఎస్సై విజ‌య్ కుమార్
X

దిశ, మద్దూరు : ప్ర‌జ‌ల ప్రాణాల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని ఎస్సై విజ‌య్ కుమార్ పేర్కొన్నారు. మ‌ద్దూరు ప‌ట్ట‌ణ కేంద్రంలో ఎస్సై విజ‌య్ కుమార్ ఆధ్వ‌ర్యంలో ఆటో డ్రైవ‌ర్ల‌కు రోడ్డు భ‌ద్ర‌త, ట్రాఫిక్ నిబంధ‌న‌లు, వాహ‌న ప‌త్రాలు, హెల్మెట్ వినియోగం, మ‌ద్యం సేవించి డ్రైవింగ్ చేయ‌రాద‌ని సూచిస్తూ అవ‌గాహ‌న నిర్వ‌హించారు. ఎస్సై విజ‌య్ కుమార్ మాట్లాడుతూ ప్ర‌జ‌ల ప్రాణాల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం మ‌నంద‌రి బాధ్య‌త అని డ్రైవ‌ర్లు ఎల్ల‌ప్పుడూ జాగ్ర‌త్త‌గా వాహ‌నాలు న‌డ‌పాల‌ని సూచించారు. చిన్న నిర్ల‌క్ష్యం పెద్ద ప్ర‌మాదాల‌కు దారి తీస్తుంద‌న్నారు. ఆటోలో ప‌రిమితికి మించి ప్రయాణికులను, విద్యార్థులను, కూలీలను ఎక్కించికోరాదని సూచించారు. ప్రయాణికులతో మర్యాదపూర్వక ప్రవర్తన, చట్ట ఉల్లంఘనలకు పాల్పడరాదని వారికి సూచించారు. ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదు, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలన్నారు. అలాగే మ‌ద్దూరు మండ‌ల వ్యాప్తంగా రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల కోసం టిప్ప‌ర్ల ద్వారా మ‌ట్టి, కంక‌ర‌ను త‌ర‌లిస్తున్న టిప్ప‌ర్ డ్రైవ‌ర్లు నిర్ణీత వేగంతో పాటు.. ఊర్ల‌లో నిదానంగా వెళ్లాల‌ని సూచించారు.

Next Story