- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్చి 31 నాటికి అచ్చంపేట మున్సిపాలిటీ పన్నుల వసూళ్ల టార్గెట్ సాధ్యమేనా..?
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ శాఖ ఈ ఏడాదికి సంబంధించిన వివిధ రకాల పన్నులను పట్టణంలో ఈ ఏడాదికి రూ. 3.39 కోట్లు పన్నులు వసూళ్లు చేయాల్సి ఉండగా.. ఇంకా దాదాపు రూ. 51 లక్షల పెండింగ్ లో ఉన్నాయి.

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ శాఖ ఈ ఏడాదికి సంబంధించిన వివిధ రకాల పన్నులను పట్టణంలో ఈ ఏడాదికి రూ. 3.39 కోట్లు పన్నులు వసూళ్లు చేయాల్సి ఉండగా.. ఇంకా దాదాపు రూ. 51 లక్షల పెండింగ్ లో ఉన్నాయి. దానిని అధిగమించేందుకు మున్సిపల్ శాఖ శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేస్తేనే 15వ ఆర్థిక సంఘం కి సంబంధించిన నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. కానీ గడువు మాత్రం ఈ నెల 31 తో ముగియనుండడంతో సాధ్యమయ్యేనా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు ఇంటి నిర్మాణా, పక్కా గృహాల, వాటర్, తై బజార్, వ్యాపార సంస్థల తదితర పన్నులు ఇతర సముదాయాల నుంచి రావాల్సిన పన్నులను దాదాపుగా రాబట్టారు. అత్యధికంగా వివిధ ప్రభుత్వ కార్యాలయ నుంచి పన్నులు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లోనే ఉన్నాయి. గడిచినా కొన్ని రోజుల క్రితం 56 లక్షలు పన్నులు రావాల్సి ఉండగా.. 9 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదికి సంబంధించిన దాదాపు 27 లక్షల పన్నులు కూడా కలిపి వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ నెలలో మిగిలింది 08 రోజుల మాత్రమే ఉన్నాయి.
పట్టణంలో ఏఏ ప్రభుత్వ కార్యాలయాలు ఎంత అప్పు
అచ్చంపేట పట్టణంలోని ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయం నుండి రావలసిన పన్నులు పెండింగ్లో ఉన్నాయి. అందుకు సంబంధించి పోలీస్ స్టేషన్ నుండి రూ. 25 లక్షలు అటవీ శాఖ వారి నుండి రూ. 14 లక్షలు భారత్ సంచార నిగం లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం నుండి రూ. ఆరు లక్షలు, ఎంపీడీవో కార్యాలయం నుండి రూ. 5.5 లక్షలు, మిల్క్ సెంటర్ కార్యాలయం నుండి రూ. 3.7 లక్షలు, పోస్ట్ ఆఫీస్ తపాలా కార్యాలయం నుండి రూ.3 లక్షలు ఇలా మొత్తం రూ. 58 లక్షలు పన్నుల రూపంలో మున్సిపల్ కార్యాలయానికి రావాల్సి ఉంది.
టార్గెట్ అధిగమిస్తాం.. కమిషనర్ మురళి
మార్చి 31 నాటికి మిగిలిన 51 లక్షల పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేస్తారా అని దిశ మున్సిపల్ కమిషనర్ మురళిని కోరగా తప్పక సాధిస్తామని, 15 ఫైనాన్స్ నిధులు కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అత్యధికంగా వివిధ ప్రభుత్వ కార్యాలయం సంబంధించిన దాదాపు 60 లక్షలకు పైగా పన్నులు రావాల్సి ఉందన్నారు.






