ఉపాధి ప‌నుల్లో అవ‌క‌త‌వ‌క‌లు..!

by Ratna Kumari |

దిశ, మానవపాడు : ఒకరి బదులు మరొకరు బినామీలుమారి ఉపాధిహామీ పథకంలో పని చేస్తూ డబ్బులు చెల్లింపులు చేయడం చాలా దారుణంగా ఉందని, వంద రోజులు పూర్తి చేసుకున్న వారికి మరొక వ్యక్తి పేర్లు కేటాయించి

ఉపాధి ప‌నుల్లో అవ‌క‌త‌వ‌క‌లు..!
X

దిశ, మానవపాడు : ఒకరి బదులు మరొకరు బినామీలుమారి ఉపాధిహామీ పథకంలో పని చేస్తూ డబ్బులు చెల్లింపులు చేయడం చాలా దారుణంగా ఉందని, వంద రోజులు పూర్తి చేసుకున్న వారికి మరొక వ్యక్తి పేర్లు కేటాయించి వీరితో పనులు ఎలా చేయించి బిల్లులు చేయడం ఏమిటని డిఆర్డిఓ నర్సింగ్ రావు అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అందరిపై చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ చేయాలి అనుకుంటే చేయండి లేకపోతే ఇండ్ల దగ్గర కూర్చోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. మానవపాడు మండలంలోని ఉపాధి హామీ పథకంలో 2024 2025లో దాదాపు 3 కోట్లకు పైగా ఉపాధి హామీ పనులు నిర్వహించారు. ఈ పనులపై 16వ విడుత సామాజిక తనిఖీపై ప్రజా వేదిక కార్యక్రమాన్ని మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు.

ముందుగా గోకులపాడులో జరిగిన పనుల వివరాల గురించి సామాజిక తనిఖీ బృందం వివరాలు వెల్లడించింది. గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఏడు రకాల రికార్డులకు ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదని, ఇలా ఉంటే సామాజిక తనికి ఎలా చేపట్టాలని అధికారుల ముందు బృందం వాపోయింది. 2023 నర్సరీ సంబంధించి మొక్కల వివరాలు రికార్డుల్లో సబ్మిట్ చేయలేదు. పనులకు సంబంధించిన క్యాష్ బుక్కు కూడా ఇవ్వలేదని, ఒక మస్టర్ లో అన్ని సంతకాలు ఒక్కరితో చేయించారని తెలిపారు. నర్సరీలో 1400 మొక్కలు ఉండగా ఒక్క మొక్కను నాటించలేదని, అందులో 569 పైగా మొక్కలు చనిపోయి ఉన్నాయని గుర్తించారు. టేబుల్ రూల్ కాల్స్ నిర్వహించి ఇష్టం వచ్చినట్లు మండల ఏపిఓ సంతకాలు చేసినట్లు గుర్తించారు. పోతులపాడులో మస్టర్ రికార్డులు పంచాయతీ కార్యదర్శి సంతకాలు లేకుండానే ఉపాధి కూలీలకు బిల్లులు చెల్లించాలని సామాజిక బృందం వెల్లడించింది. ఈ గ్రామంలో కూడా క్యాష్ బుక్, ఉపాధి హామీకి సంబంధించిన ఏడు బుక్కుల రికార్డులు సబ్మిట్ నేటికీ చేయలేదు. టెక్నికల్ అసిస్టెంట్ పర్యవేక్షించినట్లు రికార్డులు ఎక్కడ కూడా సంతకం చేయలేదు. ఫిల్ అసిస్టెంట్ భర్తపై ఒక జాబ్ కార్డు, అతని భార్యపై మరొక జాబ్ కార్డు ఉండటం ఏమిటని ప్రశ్నించారు.

చెన్నిపాడు గ్రామంలో ఒకరికి బదులు మరొకరు అలా 20 మందికి పైగా పనులు చేశారని, సుమారు రెండు లక్షల వరకు బిల్లులు చెల్లింపులు జరిగినట్లు సామాజిక బృందం వెల్లడించింది. వంద రోజులు పనులు పూర్తి చేసుకొని మీటింగ్ గా వ్యవహరిస్తున్న వారితో పనులు చేయించి బిల్లును చేయించారని, ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం ఉందని తెలిపారు. మస్టర్లో చాలా చోట్ల తప్పులు సరిదిద్దారని, రికార్డులు కూడా సరిగ్గా లేవని సామాజిక బృందం తెలిపింది. సాయంత్రం ఆరు గంటల వరకు కేవలం ఐదు గ్రామాలకు సంబంధించిన సామాజిక తనిఖీ పూర్తి అయింది. మిగతా 11 గ్రామాల సామాజిక తనిఖీ పూర్తి కావడానికి రాత్రి 11 కావచ్చు అని ఎంపీడీవో తెలిపారు.

తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు...

సామాజిక తనిఖీ ప్రజావేదికలో ముఖ్యంగా తెలిసింది ఏమిటంటే... ఫీల్డ్ అసిస్టెంట్ ఒక్కరు కూడా సక్రమంగా పనిచేసినట్టు కనిపించలేదని DRDO నర్సింగ్ రావు మండిపడ్డారు. నెలసరి మీటింగ్ లో ఏ అధికారి మీకు చెప్పరా, ఒక్కరైనా సక్రమంగా పనిచేసే ఉంటే సామాజిక తనిఖీలు తప్పులు తడకలు రావు కదా అని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదన్నారు. ఉపాధి హామీకి సంబంధించిన ఏడు రకాల రిజిస్టర్ సక్రమంగా రాకపోవడం ఏమిటో కానీ, ఆ బుక్కులు ఎలా ఉంటాయో కూడా కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పనులకు సంబంధించిన క్యాష్ బుక్ ఇవ్వకుండా బీరువాలోనే దాచిపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంకు సంబంధించిన పనుల్లో పంచాయతీ కార్యదర్శుల సంతకాలు చేయకపోవడం ఏమిటని... డ్యూటీ చేస్తున్నారా లేదా ఇంట్లో దగ్గరే ఉండే పర్యవేక్షిస్తున్నారని మండిపడ్డారు.

Next Story