చదువుతో పాటు బయటి ప్రపంచాన్ని పరిచయం చేయండి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Ratna Kumari |

విద్యార్థుల భవిష్యత్తు బలంగా ఉండాలంటే పాఠ్యపుస్తకాల చదువుతో పాటు బయటి ప్రపంచం పై కూడా అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

చదువుతో పాటు బయటి ప్రపంచాన్ని పరిచయం చేయండి :  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : విద్యార్థుల భవిష్యత్తు బలంగా ఉండాలంటే పాఠ్యపుస్తకాల చదువుతో పాటు బయటి ప్రపంచం పై కూడా అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మౌంట్ బాసిల్ స్కూల్‌ లో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నాణ్యమైన విద్యతోనే మంచి అవకాశాలు ఎవరికైనా సాధ్యమవుతాయని, సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకోవచ్చన్నారు. పాఠశాలలు కేవలం పాఠ్యాంశాలను బోధించే స్థలాలుగానే కాకుండా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే వేదికలుగా మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేదిక ప్రసంగాలు, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ మంజుల, పాఠశాల డైరెక్టర్లు చంద్రకళ వెంకటయ్య, పూజిత మోహన్ రెడ్డి, కృష్ణ మాధవి, ప్రవీణ్ కుమార్ శిరీష, ప్రిన్సిపాల్ సోమశేఖర్, ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు, ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story