- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జేపీఎన్సీఈ కళాశాలలో అంతర్జాతీయ సెమినార్
నూతన విద్యా ఆవిష్కరణలకు ఆలవాలమైన స్థానిక జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల అంచెలంచెలుగా ఎదుగుతూ, అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే స్థాయికి చేరుకుందని కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ తెలిపారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : నూతన విద్యా ఆవిష్కరణలకు ఆలవాలమైన స్థానిక జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల అంచెలంచెలుగా ఎదుగుతూ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయలతో ఒప్పందాలు కుదుర్చుకునే స్థాయికి చేరుకుందని కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం జేపీఎన్సీఈ కళాశాలలో ఆయన తన ఛాంబర్ లో మాట్లాడుతూ విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు, కళాశాల ఆడిటోరియంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 'గ్లోబల్ సహకారం-అకాడమిక్ ఎక్సైజ్' అనే అంశంపై ఒక్క రోజు అంతర్జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సెమినార్ కు జపాన్ దేశ ఎమాన్కా విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ అకిరా, రాయపూర్ ఎన్ఐటీ డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ రమణారావు, హైదరాబాద్ ఐఐటి కంప్యూటర్ సైన్స్ విభాగం హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ సి.కృష్ణ మోహన్ లు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సెమినార్ ద్వారా అంతర్జాతీయ అకాడమిక్ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, గ్లోబల్ సహకారాన్ని ప్రోత్సాహించడం, అధ్యాపకులు, విద్యార్థులకు విలువైన అవగాహన, అనుభవాన్ని ఇస్తుందని రవికుమార్ అన్నారు.






