- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహనాల తనిఖీ.. రూ.1లక్ష నగదు పట్టివేత
దిశ, వెల్దండ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా శనివారం వెల్దండ మండల పరిధిలోని కొట్రా చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా రూ.1లక్ష నగదును పట్టుకున్నట్టు

దిశ, వెల్దండ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా శనివారం వెల్దండ మండల పరిధిలోని కొట్రా చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా రూ.1లక్ష నగదును పట్టుకున్నట్టు ఎస్సై కురుమూర్తి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల కోడ్ లో వాహనాల తనిఖీ చేస్తుండగా నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల కు గ్రామానికి చెందిన మహమ్మద్ జహీర్ తన కారులో రూ.1లక్ష నగదుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకొని నగదును సీజ్ చేశారు. ఎక్స్ పెండిచర్ మానిటరింగ్ సేల్ కు పంపించినట్టు ఎస్సై కురుమూర్తి తెలిపారు. ఎన్నికల కోడ్ లో భాగంగా రూ.50వేల పైబడి ఎవరైనా నగదు తీసుకెళ్లిన వాటిని సంబంధించి రసీదులు ఉండాలని లేని పక్షంలో డబ్బులు సీజ్ చేస్తామని తెలిపారు. ఈ తనిఖీలో ఎస్ఎస్టీ టీమ్ ఇన్ చార్జి లక్ష్మీపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






