అపర భద్రాద్రి (శిరసనగండ్ల) ఆలయ అభివృద్ధి పనులు పరిశీలన

by Ratna Kumari |   (  Updated:2025-11-11 09:07:18  IST  )

దిశ, చారకొండ : అపర భద్రాద్రి గా పేరుగాంచిన శిరసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయాన్ని తెలంగాణ టూరిజం డీఈ పర్శవేది గౌడ్, నాగార్జున గౌడ్, శ్రీ వెన్ కన్సల్టెంట్స్ ఆర్చిటెక్చర్ రమణారావు, మహేష్ లు

అపర భద్రాద్రి (శిరసనగండ్ల) ఆలయ అభివృద్ధి పనులు పరిశీలన
X

దిశ, చారకొండ : అపర భద్రాద్రి గా పేరుగాంచిన శిరసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయాన్ని తెలంగాణ టూరిజం డీఈ పర్శవేది గౌడ్, నాగార్జున గౌడ్, శ్రీ వెన్ కన్సల్టెంట్స్ ఆర్చిటెక్చర్ రమణారావు, మహేష్ లు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ టూరిజం శాఖ నుంచి రూ. 2 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఆలయ ఆవరణంలో సంతోష్ భవనంలో 18 గదులకు మరమ్మతులు, దేవాలయం దిగువన 12 షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు కోనేరు అభివృద్ధి చేయనున్నట్లు వారు వివరించారు. ఈ ప్రతిపాదనలు సంబంధిత అధికారులకు నివేదించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ డేరం రామశర్మ, ఆలయ ఈవో ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి, నాయకులు కళ్ళు సురేందర్ రెడ్డి, అర్చకులు మురళీధర్ శర్మ, లక్ష్మణ్ శర్మ, ఆనంద్ శర్మ, కోదండరామశర్మ, మేనేజర్ నిరంజన్ పాల్గొన్నారు.

Next Story