సంక్షేమ పథకాల సమాచారం ప్రజలకు సమర్థవంతంగా చేరవేయాలి

by Ratna Kumari |

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచారశాఖ సమర్ధవంతంగా పని చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

సంక్షేమ పథకాల సమాచారం ప్రజలకు సమర్థవంతంగా చేరవేయాలి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచారశాఖ సమర్ధవంతంగా పని చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఇటీవల ప్రభుత్వవిప్‌ గా ఎంపికైన సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా సమాచార, ప్రజాసంబంధాల శాఖ (డిపిఆర్ఓ) అధికారి శ్రీనివాస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు సరైన సమాచారం అందేలా సమాచార శాఖ అధికారులు చురుకుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చారి పాల్గొన్నారు.

Next Story