ఇందిరమ్మ ఇండ్లు అమ్ముకుంటున్నారు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

by Muthe.Rajitha |

అలంపూర్‌(Alampur)లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం(Indira Mahila Shakti Program)లో తీవ్ర గందరగోళం నెలకొంది.

ఇందిరమ్మ ఇండ్లు అమ్ముకుంటున్నారు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్ : అలంపూర్‌(Alampur)లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం(Indira Mahila Shakti Program)లో తీవ్ర గందరగోళం నెలకొంది. అలంపూర్‌లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు(BRS MLA Vijayudu) తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme)లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు డబ్బులు వసూలు చేస్తూ ఇళ్లు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే విజయుడు, ఆయన శ్రేణులు వేదికపై ఉన్న కాంగ్రెస్ నేతలతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఓవైపు ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. ఆయన చేతిలోని మైక్‌ను అధికారులు లాక్కోవడానికి ప్రయత్నించారు.

దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కూడా ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా వేదికపై ఉన్న మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) జోక్యం చేసుకొని ఇరువైపులా నాయకులూ వెనక్కి తగ్గారు. ఈ ఘటన పాలమూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story