ఇందిర‌మ్మ ఇళ్లు నిరుపేద‌ల‌కు వ‌రం : జిల్లా హౌసింగ్ పీడీ వితోభ

by Ratna Kumari |

మండలంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం లాంటిదని జిల్లా హోసింగ్ పీడి వితోభ అన్నారు.

ఇందిర‌మ్మ ఇళ్లు నిరుపేద‌ల‌కు వ‌రం : జిల్లా హౌసింగ్ పీడీ వితోభ
X

దిశ‌, రేవ‌ల్లి : మండలంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం లాంటిదని జిల్లా హోసింగ్ పీడి వితోభ అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని పాతతండాలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి మంజూరై లబ్ధి చేకూరుతుందని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్ర‌తి పేద‌వాడికి ఇందిర‌మ్మ ఇళ్లు అందించాల‌నే ఉద్దేశంతోనే ఈ ప‌థ‌కాన్ని రూపొందించింద‌ని తెలిపారు. హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు, గ్రామపంచాయతీ సెక్రటరీ పరశురాములు పాల్గొన్నారు.

Next Story