ఇందిర‌మ్మ ఇళ్ల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

by Ratna Kumari |

నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల‌ను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

ఇందిర‌మ్మ ఇళ్ల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాలి  : మంత్రి జూపల్లి కృష్ణారావు
X

దిశ‌, పాన్ గ‌ల్/ కొల్లాపూర్ : నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల‌ను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం పాన్ గల్ మండల పరిధిలోని కేతేపల్లి, వెంగలాయిపల్లి, జమ్మాపూర్ గ్రామాల్లో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిని పరిశీలించారు. అనంతరం వెంగలాయపల్లి జమ్మాపూర్ గ్రామాల్లో సర్పంచులు బంగ్లా అనసూయమ్మ, అన్నె మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశాలకు మంత్రి జూపల్లి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రారంభించని లబ్ధిదారులు పది రోజుల్లోగా ఇంటి నిర్మాణాలను ప్రారంభించాలన్నారు.

గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు మంత్రి జూపల్లికి వినతి పత్రం అందజేశారు. ప్రధానంగా త్రాగునీటి ఎద్దడి నివారణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి జూపల్లి త్రాగు నీటి నివారణకు మినీ ట్యాంకుల నిర్మాణాలు చేపట్టాలని RWS ఏఈ అనుదీప్ రెడ్డిని ఆదేశించారు. గ్రామాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మాజీ జ‌డ్పీటీసీ రవికుమార్, త‌హ‌శీల్దార్ కార్తీక్ రావు, ఎంపీడీవో గోవిందరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story