- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెంచు ఆదివాసులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
by Elthuri vijay kumar |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు, ప్రధానమంత్రి జనధన్ పథకంలో కేటాయించిన ఇండ్లను ఐటీడీఏ తరఫున నిర్మించి ఇవ్వాలని చెంచు ఆదివాసులు కోరారు.

X
చెంచు ఆదివాసులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
మన్ననూరు ఐటీడీఏ కార్యాలయంలో వినతిపత్రం అందజేత
దిశ, అమ్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు, ప్రధానమంత్రి జనధన్ పథకంలో కేటాయించిన ఇండ్లను ఐటీడీఏ తరఫున నిర్మించి ఇవ్వాలని చెంచు ఆదివాసులు కోరారు. ఈ మేరకు వారు నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం వినతిపత్రం సమర్పించారు. చెంచు పేదలకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో స్వయంగా ఇళ్లు నిర్మించుకోవడం కష్టమైందని, అందువల్ల ఐటీడీఏ నిర్మాణం చేపట్టి ఇస్తే సదుపాయం కలుగుతుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఐటీడీఏ పరిధిలోని అచ్చంపేట, అమ్రాబాద్, పదరా, లింగాల, బల్మూరు, కొల్లాపూర్ తదితర గ్రామాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈదమ్మ, వీరస్వామి, నల్లపోతుల పెద్దిరాజు, గోపి, వెంకటస్వామి తదితరులు వినతిపత్రం అందజేశారు.
Next Story






