ప్రజల దీవెనలతోనే ఇందిరమ్మ రాజ్యం : దేవరకద్ర ఎమ్మెల్యే

by Chintha Aamani |

ప్రజల దీవెనలతోనే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు.

ప్రజల దీవెనలతోనే ఇందిరమ్మ రాజ్యం : దేవరకద్ర ఎమ్మెల్యే
X

దిశ,దేవరకద్ర : ప్రజల దీవెనలతోనే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకద్ర మండలం గూర కొండ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ,బీసీ కమ్యూనిటీ హాల్, సిసి రోడ్ల నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలంతా కోరుకుని జీవించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు.

అధికారంలోకి రాగానే వెంటనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక 48 గంటల్లోనే 6 గ్యారంటీల్లో రెండిటిని అనగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం 10 లక్షల ఆరోగ్య శ్రీ బీమా పెంపు అమలు చేశామన్నారు. అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ , ఉచిత విద్యుత్ ను అందిస్తున్నట్లు గుర్తు చేశారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామనీ ,సన్న బియ్యం ఇస్తున్నామని త్వరలో వరి ధాన్యానికి సంబంధించిన బోనస్ ని వేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలపై భారం పడకూడదని తమ ప్రభుత్వం భావిస్తుందని ఇందులో భాగంగానే మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.

అందులో భాగంగానే స్వయం శక్తి మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నామని ఇందిరా మహిళా శక్తి పేరుతో వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మహిళలను లక్ష అధికారులుగా, కోటీశ్వరులుగా చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని కానీ మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజేషన్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మీకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంజిల్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉషనప్ప, కాంగ్రెస్ నాయకులు కోన రాజశేఖర్, ప్రేమ్ కుమార్ యాదవ్, తహసీల్దార్ కృష్ణయ్య ఎంపీడీవో శ్రీనివాసరావు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Next Story