- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి గ్రామానికి బంపర్ ఆఫర్
దిశ, కొల్లాపూర్ : తెలంగాణ లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలతో పల్లెలు పండుగ వాతావరణంలో మునిగి పోయాయి. రెండు విడుత నామినేషన్ల స్వీకరణ ఘట్టం మంగళవారం సాయంత్రం ముగిసింది.

దిశ, కొల్లాపూర్ : తెలంగాణ లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలతో పల్లెలు పండుగ వాతావరణంలో మునిగి పోయాయి. రెండు విడుత నామినేషన్ల స్వీకరణ ఘట్టం మంగళవారం సాయంత్రం ముగిసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి ఆ గ్రామానికి బంపర్ ఆపర్ ను ఇవాళ ప్రకటించారు. ఇదే అంశం సోషల్ మీడియా వైరల్ కావడంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామ పంచాయతీ కి సర్పంచ్ గా పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి మల్లెపల్లి లక్ష్మారెడ్డి తనను ఏకగ్రీవం సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామానికి రూ.30 లక్షలు, ట్రాక్టర్ ఇస్తానని ప్రకటించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గ్రామాభివృద్దిని అకాంక్షించి ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి తనను సర్పంచ్ గా ఏకగ్రీవం చేయాలని ఆయన ఇచ్చిన హామీలు వరాల జల్లులా కురుస్తున్నాయి. ఈ హామీ పై సింగోటం ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తూ చర్చనీయాంశంగా మారింది.






