- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక్కడ 163 సెక్షన్ అమలు..ఎందుకంటే..?
జిల్లాలో జరిగే ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద బుధవారం నుంచి ఈ నెల 22 వరకు బీఎన్ఎస్ 163 సెక్షన్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లాలో జరిగే ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద బుధవారం నుంచి ఈ నెల 22 వరకు బీఎన్ఎస్ 163 సెక్షన్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం10922 మంది విద్యార్థులు,రెండవ సంవత్సరం 11561 మంది విద్యార్థులతో మొత్తం 22483 మంది 36 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారని ఆమె తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద జీరాక్సు,ఇంటర్నెట్ సెంటర్లు మూసి ఉంచాలని,పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని 200 మీటర్ల వరకు ప్రజలు గుమ్మి కూడదని,లౌడ్ స్పీకర్స్ పూర్తిగా నిలిపివేయాలని ఆమె ఆదేశించారు. అంతేకాకుండా హాల్ టికెట్లలో పేర్కొన్న సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. సెల్ ఫోన్,ట్యాబ్,పెన్ డ్రైవ్,బ్లూ టూత్,ఎలక్ట్రానిక్ వాచ్,కాలిక్యూలేటర్స్,వాల్లెట్లు తీసుకరాకూడదని ఆమె ఖచ్చితంగా ఆదేశించారు. పరీక్ష కేంద్రానికి ప్రవేశించే గేటు ముందు పోలీసులు తనిఖీలు జరుగుతాయని,అందుకు విద్యార్థులు పోలీసులకు సహకరిస్తూ,శాంతియుత వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలను సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.






